KDP: మైదుకూరు మున్సిపాలిటీలోని నంద్యాల రోడ్డు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లే రహదారి డ్రైనేజీ నిండిపోవడంతో స్థానికులు, వాహనదారులు దుర్వాసనతో అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి డ్రైనేజీలోని బురద మొత్తం రోడ్డుపై నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు స్పందిచాలని స్థానికులు కోరుతున్నారు.