SRD: జిల్లాలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు గ్రామాలను స్వచ్ఛతగా ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.