KDP: బి. కోడూరు (M) అయ్యవారిపల్లిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పట్టించునే వారు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లపైకి నీళ్లు చేరి మురికిగా తయారవుతున్నాయి. ఆ మురికి నీళ్లపై దోమలు, ఇతర బాక్టీరియా చేరి జ్వరాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు.