KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర- విజయలక్ష్మీ దంపతులు కలిసి తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు, ఆలయ అధికారులు ఎంపీ దంపతులకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.