CTR: చౌడేపల్లి మండలం మడుకూరులో ఆదివారం కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన మునుస్వామి ఇంటి గోడ ఒక వైపు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ అధికారులు గాలివానకు కూలిపోయిన ఇంటిని పరిశీలించి నష్టపరిహారం నివేదిక జిల్లా అధికారులకు పంపనున్నారు.