NGKL: ప్రకృతిలో లభించే వనమూలికలతో ఔషధాలను తయారు చేసి వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులను ప్రోత్సహించాలని ఎంపీ మల్లురవి సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.