NRML: ఖానాపూర్ మండలంలోని రాజురా గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన ఆరోగ్య ఉపకేంద్రం (సబ్ సెంటర్ )ను ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎంపీ గోడం నగేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.