HYD: నగరంలోని ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, దోమలగూడ, విద్యానగర్, బాగ్లింగంపల్లి, అంబర్పేట, కాచిగూడ, బర్కత్పురాలలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.