NLG: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాఠశాల అటెండర్ కు పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. తిప్పర్తి మండలం సిలార్ మియాగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ లతీఫ్ సాబ్ కష్టాలను తెలుసుకున్న పూర్వ విద్యార్థులు తమవంతు సాయం అందించారు. వీరంతా కలిసి రూ.1,05,500 సేకరించి DCC ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.