MDK: నిజాంపేటలో బండారి చిన్నక్క (37) అనే వివాహిత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.