TPT: తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగిన సూచనలు చేసి, సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను లోటు పొరపాట్ల లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.