కోనసీమ: అల్లవరం మండలం డి. రావులపాలెం గ్రామానికి చెందిన ఆక్వా రైతు ఒంటెద్దు నాగబాబు (48) ఆదివారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గుండెపూడిలోని తన ఆక్వా చెరువు వద్ద మోటారును ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతంలో కాంట్రాక్టర్‌గా పనిచేసిన నాగబాబు ఇటీవల ఆక్వా సాగును ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.