RR: హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్ వందనపురి కాలనీలో పర్యటించారు. కాలనీవాసులు రోడ్లు, దోమల సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లగా..ప్రధాన, అంతర్గత రోడ్ల అభివృద్ధికి రూ.5.5 కోట్లు మంజూరయ్యాయని, కౌన్సిల్ ఆమోదం తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. ఓపెన్ జిమ్, వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.