కోనసీమ: పి.గన్నవరం జెడ్పీహెచ్ స్కూల్కు చెందిన మట్టపర్తి అవంతి (అండర్ -17), కడలి హిరణ్యవల్లి (అండర్ -14), గుమ్మళ్ల నితీష్ (అండర్ -17) రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం ఉమాదేవి ఆదివారం తెలిపారు. కాకినాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా సెలక్షన్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారన్నారు.