KDP: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి APTF నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇవాళ ప్రొద్దుటూరులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విన్నవించుకున్నారు.