AP: అద్దంకి నియోజకవర్గంలో 65 మంది లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ CMRF చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని చెప్పారు. PPP విధానంలో వైద్యకళాశాలలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పెట్టుబడులు రాకుండా మాజీ సీఎం జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు, రాష్ట్రానికి నష్టం చేసే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.