WGL: రాయపర్తిలో BRS నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ధర్నాపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ధర్నాలో రైతులు పాల్గొనలేదని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు తము ఆధారాలతో సహా చూపిస్తామని, దమ్ముంటే రాయపర్తి బస్టాండ్‌లోకి వచ్చి నిరూపించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు.