TG: HYDకి చెందిన రంగారెడ్డి అనే యోగా గురువు హనీట్రాప్‌లో చిక్కుకొని రూ.50 లక్షలు పోగొట్టకున్నాడు. అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలు చేవెళ్లలోని యోగా ఆశ్రమంలో చేరారు. ఈ క్రమంలో వారు కొద్దిరోజులపాటు రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు తీశారు. ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి రూ.50 లక్షలు కాజేశారు. మరో రూ.2 కోట్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.