PDPL: మంథని మండలంలోని ధర్మారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పుదరి సర్వేశ్ గౌడ్ కోరారు. మంత్రిని కలిసిన ఆయన ధర్మారం (గద్దలపల్లి)-జిల్లాలపల్లి, అలాగే గద్దలపల్లి-రామకృష్ణాపురం రోడ్ల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.