పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్, వాణీ కపూర్ నటించిన మూవీ ‘అబీర్ గులాల్’. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మూవీని భారత్లో బ్యాన్ చేశారు. అయితే ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానున్నట్లు వస్తోన్న వార్తలను PBI ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని, ఆ మూవీ విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పింది.