KDP: కూటమి ప్రభుత్వంలో రజకులకు రక్షణ లేకుండా పోతోందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ముడమాల గురుప్రసాద్ అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే హక్కును వినియోగించుకున్న ప్రతిసారీ రజకులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ హక్కులకు పెద్ద ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.