MBNR: రాష్ట్ర స్థాయి సీనియర్స్ మహిళా, పురుషుల, జూనియర్స్ బాలబాలికల నెట్‌బాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్లను నేడు ఉదయం 10 గంటలకు డీఎస్ఏ మైదానంలో ఎంపికలు చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు విక్రమాదిత్య రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్స్ విభాగంలో 2007 మార్చి 31 తర్వాత జన్మించిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు.