SRD: కంగ్టి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా రవీందర్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక ఎస్సై దుర్గారెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలవగా, ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రవీందర్ గౌడ్ గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కొంతకాలం హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఈయన బదిలీపై వచ్చారు.