కడప: పోలీసు శాఖ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు జరిపి ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, అవగాహన అందించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఇది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.