GNTR: అమరావతి నాట్యోత్సవం 2025లో చిన్నారులు, యువ నర్తకులు కూచిపూడి ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను శనివారం అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కోకా విజయలక్ష్మి లలిత కళా సేవలు ప్రశంసనీయం అన్నారు. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ గత 9 ఏళ్లుగా సంగీత, నృత్య, సాహిత్య రంగాలలో ప్రతిభావంతులను తీర్చిదిద్దుతూ దేశ విదేశాలలో కీర్తి తెచ్చుకుందని గుర్తు చేశారు.