KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో అంబేడ్కర్ భవన నిర్మాణ సాధనకు పోరాడుదామని భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్ కదిరికోట ఆదెన్న పిలుపునిచ్చారు. స్తానిక కుర్ని కళ్యాణ మండపంలో దళిత సమ్మేళన సభఅట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.