»Center That Gave A Big Twist On Visakha Steel Plant
Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు
విశాఖపట్నం(Visakhapatnam) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.అర్ఎన్ఐఎల్ (RNIL) ను బలోపేతం చేసే పనిలో ఉన్నామంటూ తెలిపింది. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తెలిపారు. వీటిపై అర్ ఐ ఎన్ ఎల్ (RINL) యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. ఈ తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే(Minister Faggan Singh Kulaste) ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని, సంస్థను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదు. ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ప్రకటనలో తెలిపింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల (Investments) ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని చెప్పింది.1971లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారాన్ని 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.10వేలకోట్లను, 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of AP) సహకరించింది. తర్వాతకాలంలో ప్రభుత్వాలు మారుతుండటం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది.