SKLM: విద్యా శిక్షణ సంస్థ (డైట్) వమరవల్లిలో ఇటీవల నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీలలో భాగంగా శాస్త్రీయ సంగీత విభాగంలో నగరానికి చెందిన కేంద్రీయ విద్యార్థిని పుల్లేటికుర్తి జోషిత ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. విద్యార్థిని త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనుంది. ఈ సందర్భంగా శనివారం సంగీత ఉపాధ్యా యుడు జాక త్రివిక్రమ్ దేవ్ విద్యార్థి జోషితను అభినందించారు.