KMR: లింగంపేట మండలం భవానిపేట గ్రామ శివారులో కరెంట్ షాక్‌తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్‌మన్ పాండు శనివారం తెలిపారు. మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటార్‌కు సంబంధించిన సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్‌పై పడటంతో ఘటన జరిగింది. రూ.3 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.