TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన బన్సీలాల్ పేట డివిజన్లో పర్యటించి స్థానిక అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని, అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించి తగు సూచనలు చేయనున్నారు.