VKB: తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో దిడ్డి వాగు దాటుతుండగా గల్లంతై బొక్తం మొగులప్ప మరణించాడు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణమే ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కను అందించారు. ఈ మేరకు బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.