తెలుగు దేశం పార్టీ (telugu desam) అధినేత నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) గుడివాడ పర్యటనకు (chandrababu gudivada tour) ముందు ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ ప్రాంతంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు (tdp versus ycp) పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎవరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని ఇరు పార్టీల కార్యకర్తలకు సూచించారు. ఇరువర్గాలు ఎదురెదురు పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్ఎస్జీ బలగాలను రంగంలోకి దింపారు. చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్డు షో ప్రవేశించింది. సరిహద్దులో రావి వెంకటేశ్వర రావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్డు షోకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. టీడీపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. గుడివాడ వీధులు మొత్తం పసుపుమయంగా మారిపోయాయి.
అంతకుముందు చంద్రబాబు పర్యటనకు (chandrababu tour) ముందే శరత్ థియేటర్ వద్ద కూడా హైటెన్షన్ నెలకొన్నది. ఓ టైంలో బాహాబాహీ దిగగా, పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గుడివాడలో ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగినా… కొడాలి నాని కార్యాలయం వద్ద పలుమార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు శరత్ థియేటర్ వద్ద జెండా విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులతో వాగ్వాదం జరిగింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఓ వైసీపీ కార్యకర్త టీడీపీని తిట్టడంతో గొడవ ప్రారంభమైందని అంటున్నారు. అదే సమయంలో మాగంటి బాబు అనుచరులు కూడా అక్కడకు రావాడంతో వివాదం ముదిరింది.