KMR: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డిలో కార్య కర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.