KDP: కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.