BHPL: జిల్లాకు ఈ నెల 11న 264 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు డీఏవో బాబురావు తెలిపారు. భూపాలపల్లి మండలానికి 30 టన్నులు, టేకుమట్లకు 24 టన్నులు, చిట్యాలకు 20 టన్నులు, మొగుళ్లపల్లికి 25 టన్నులు,గణపురానికి 45 టన్నులు, కొత్తపల్లి గోరికి 20 టన్నులు,మహదేవపూరు 25 టన్నులు,మల్హర్ రావుకు 50 టన్నులు మంజూరు కాగా, రైతు వేదికల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు.