KNR: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు చివరి గడువు శుక్రవారంతో ముగియనుందని చిగురుమామిడి మండల కోఆర్డినేటర్ లక్ష్మణ్ రావు తెలిపారు. ఇప్పటివరకు 26 మంది పదో తరగతి, 23 మంది ఓపెన్ ఇంటర్‌కు దరఖాస్తు చేసుకున్నారని, పుస్తకాలు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. మరో 26 మంది ఓపెన్ టెన్త్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జననధ్రువీకరణ పత్రాలు సరిగాలేనందున తిరస్కరించామన్నారు.