రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో రాబోతున్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తిగా.. ఇంకా 3 పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయట. అందులో ఒక పాటను హైదరాబాద్‌లో.. మరో రెండు పాటలను గ్రీస్‌లో షూట్ చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు షూటింగ్ మొత్తం పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.