ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే.. సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది సంచలనంగా నిలిచిన కెజియఫ్ చూసి.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ఎలివేషన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సలార్ లీకులు ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్టిల్స్ కంటే..
లీక్డ్ ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు లీక్ అయిన ఓ వీడియో చూసి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమంటున్నారు. సలార్ షూటింగ్ సమయంలో తీసిన ఓ పది సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఊర మాస్ లుక్‌లో ప్రభాస్ కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే ఒరిజినల్ ఆడియో మాత్రం లేదు.. కానీ వీడియోలో ప్రభాస్‌ను చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ రగ్డ్ లుక్ అదిరిపోయేలా ఉంది. దాంతో ఇది కదా కావాల్సింది.. అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
మొత్తంగా సలార్ అఫిషీయల్ అప్టేట్స్ కంటే.. లీకులే ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తోందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ‘ఆదిపురుష్’ మూవీని వచ్చే ఏడాది జూన్ 16కు వాయిదా వేయడంతో.. సలార్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే ఏడాది ఎండింగ్ లేదా.. 2024 సంక్రాంతికి సలార్ విడుదల ఉంటుందని టాక్. ఇక చిత్రాన్నిహోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మళయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు.