HNK: హనుమకొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ను నేడు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి కలిశారు. కుడా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్కు చైర్మన్ వివరించి హనుమకొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.