ప్రకాశం: కనిగిరి ఆర్టీసి డిపోను బుధవారం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీలో సీసీ రోడ్లు నిర్మాణం కొరకు ప్రతిపాదనలు తయారు చేసి రిపోర్టును అందచేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ హసీనా బేగంకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన ఆర్టీసీ గ్యారేజీ ప్రాంగణంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.