KMR: భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని TGVP భిక్నూర్ మండల అధ్యక్షుడు దేవుని భరద్వాజ్ చెప్పారు. నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వినయ్, సభ్యులు నితిన్ పాల్గొన్నారు.