NLG: రహదారిపై ఉన్న గ్రామాల విద్యార్థులు కూడా సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారు. బస్సులు ఆలస్యంగా రావడంతో తరగతులు మిస్ అవుతున్నామని చిన్నకాపర్తి, పెద్దకాపర్తి, ఆరెగూడెంలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ వెళ్లే పల్లె వెలుగు బస్సు ఆలస్యంగా రావడంతో మండలంలోని పెద్దకాపర్తి సర్వీస్ రోడ్డులో ఆందోళన చేశారు.