NLR: అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టంలో మార్పులు తేవడం శుభపరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టంలో మార్పులు అవసరమన్నారు. అమరావతితో పాటు ప్రతి ప్రాంతంలో ఎత్తైన భవంతులు వెలుస్తున్నా.. అనుమతుల విషయంలో ఇంకా పాతచట్టాలే ఉండటం సరికాదన్నారు.