ప్రకాశం: పొదిలి ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.23లక్షల విలువచేసే 140 క్వింటాళ్ల పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా పొగాకు తరలిస్తున్న 2 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు హేమంత్ వివరించారు.