MDK: పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటు పనులకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు కీలకమని పేర్కొన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడంలో క్రమశిక్షణ, జట్టు భావన, ధైర్యం పెంపొందించుకోవడంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమన్నారు.