కృష్ణా: కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుని కుటుంబానికి జనసేన పార్టీ సభ్యత్వం ద్వారా పరిహారం మంజూరు అయింది. ఈ చెక్కును పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మంగళవారం రాత్రి వారి కుటుంబానికి అందచేశారు. జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజనాల వీరబాబు, యర్రంశెట్టి దామోదర్ పాల్గొన్నారు.