ప్రకాశం: చీమకుర్తి మండలం జి.ఎల్ పురం సమీపంలోని కారుమంచి మేజర్ కాలువ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయి దాదాపు వారం రోజులకు పైగా అయిందని మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో చెందిన యువకుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.