ప్రకాశం: దోర్నాల మండలం ఐనముక్కల వద్ద బైక్పై నుంచి జారి పడి మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ఐనముక్కలకు చెందిన దర్శనం నాగమ్మ (59) పొలంలో ఉన్న భర్తకు రొట్టెలు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బైక్పై నుంచి జారి పడింది. ఈ మేరకు స్థానికులు హుటాహూటిన ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.