KMM: ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. మీ సేవా సర్టిఫికెట్లను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు వేగవంతంగా అందించుటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.