KMR: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో KMR పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. KMR పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించింది. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి రూ. 67,200 మంగళవారం జరిమానా విధించారు.